బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 17, 2020 , 01:57:50

ఆపత్కాలంలో ఆత్మబంధువై..

ఆపత్కాలంలో ఆత్మబంధువై..

80 వేలకు పైగా..

శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని హోలిస్టిక్‌ దవాఖాన.. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ అందిస్తున్న సహకారంతో మార్చి నుంచి ఇప్పటి వరకూ రెండు నెలలుగా అన్నదాన పథకాన్ని  కొనసాగిస్తున్నది. నిత్యం వెయ్యి మందికి ఆహార పదార్థాలను అందించడం ప్రారంభించి.. . దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు 80 వేలకుపైగా ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. 150 టన్నులకు పైగా నిత్యావసరాలు అందించింది. 

ఆరు వేల మంది వలస కూలీలకు... 

 నిజాంపేట రోడ్డులో  హోలిస్టిక్‌కు ప్రత్యేక వంటగది ఉన్నది. అక్కడే సిబ్బంది ఆహార పదార్థాలను తయారు చేసి ప్యాకింగ్‌ చేస్తారు.  దవాఖాన అంబులెన్స్‌ ద్వారా నగరంలో ఎక్కడ వలస కూలీలు ఉంటున్నారో  అక్కడికి వెళ్లి భోజన పదార్థాలను అందిస్తున్నారు. ఇటీవల ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కూలీలను ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా సొంతూళ్లకు పంపే ప్రయత్నంలో  సుమారు 6 వేల మంది వరకూ లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆహార పదార్థాలను  అందించిందీ దవాఖాన యాజమాన్యం. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ , శ్రీశ్రీ హోలిస్టిక్‌ దవాఖానల చేస్తున్న సేవా కార్యక్రమాలకు పలువురిని నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. బల్దియా ఉన్నతాధికారులు,  ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి హోలిస్టిక్‌ సేవాస్ఫూర్తిని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఎవరూ ఆకలితో అలమటించకుండా లాక్‌డౌన్‌ కొనసాగే వరకు ఆహారపదార్థాలు అందిస్తామని ఈ సందర్భంగా  దవాఖాన వైద్యులు రామ్‌చంద్ర, నిఖిల స్పష్టం చేశారు. 


logo