బుధవారం 27 మే 2020
Hyderabad - May 17, 2020 , 01:50:07

ఆకలి తీర్చి..అండగా నిలిచి

ఆకలి తీర్చి..అండగా నిలిచి

మాదాపూర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేయూతనిచ్చే వారులేక ఎంతో మంది వలస కార్మికులు తమ సొంతూర్లకు పయనమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్‌ వి. జగదీశ్వర్‌గౌడ్‌ వారి ఆకలి తీర్చేందుకు ముందడుగు వేశాడు. మాదాపూర్‌ డివిజన్‌లో 54 రోజులుగా దాతల సహకారంతో రోజుకు వెయ్యి మందికి పైగా భోజనం అందిస్తూనే  తన సొంత ఖర్చులతో రోజుకు 150 నుంచి 200ల మంది నిరుపేదలు, వలస కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నాడు. ఇలా రోజుకు వేల సంఖ్యలో పేద ప్రజల ఆకలి తీరుస్తూనే డివిజన్‌పై దృష్టి కేంద్రీకరిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నాడు. 

నిరుపేదలు, వలస కూలీలకు అండగా.. 

బస్తీల్లో, రోడ్ల పక్కన గుడిసెల్లో నివాసం ఉంటూ జీవనోపాధి పొందుతున్న నిరుపేదలు, వలస కూలీలకు సాయాన్ని అందిస్తున్నాడు. ముఖ్యంగా సుభాష్‌నగర్‌, ఆదిత్యానగర్‌, ఇజ్జత్‌నగర్‌, ఖానామెట్‌, అయ్యప్పసొసైటీ తదితర ప్రాంతాల్లో నివాసం ఉండే నిరుపేదలు, వలస కార్మికుల వద్దకు స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు, భోజనాన్ని అందిస్తున్నాడు. వలస కూలీలకు కొండంత భరోసా ఇస్తూ తమ స్వగ్రామాలకు వెళ్లే అవసరం లేకుండా వారి ఆకలిని తీరుస్తున్నాడు. వీధి వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారికి శానిటైజర్‌, మాస్కులను అందజేస్తున్నాడు. 

భరోసానిస్తున్నారు

లాక్‌డౌన్‌ వల్ల పూట గడవక బతుకు దెరువు కష్టమని భావించి స్వగ్రామాలకు వెళ్దామని మేమంతా నిర్ణయించుకున్నాం. మా ఆకలి సమస్యలను తెలుసుకున్న నాయకుడు జగదీశ్వర్‌గౌడ్‌ మమ్మల్ని ఆదుకుంటామని భరోసానిచ్చి నిత్యావసర సరుకులతో పాటు ఆహారాన్ని అందిస్తున్నారు.  

- రాజేశ్‌, ఖానామెట్‌ 


logo