శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 16, 2020 , 00:02:20

రెండు లేన్లుగా ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌

రెండు లేన్లుగా ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌

అమీర్‌పేట్‌: సనత్‌నగర్‌, బాలానగర్‌ పరిసర ప్రాంతాల్లో జఠిలంగా మారుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన నిర్మాణాల కోసం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ఇరుకుగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ.. ఫ్లె ఓవర్‌కు సమాంతరంగా మరో పై వంతెన నిర్మించి రెండు లైన్లతో విస్తరించే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు  54 ప్రాంతాలను గుర్తించి అక్కడ లింక్‌రోడ్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సనత్‌నగర్‌ నుంచి ఎర్రగడ్డ వరకు 100 అడుగులతో రహదారిని విస్తరించే పనులు చేపట్టామన్నారు. మంత్రి  వెంట పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌,  కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్యలతో పాటు టీఎస్‌ఐడీసీ, రైల్వే విభాగం అధికారులు పాల్గొన్నారు. 


logo