గురువారం 28 మే 2020
Hyderabad - May 15, 2020 , 23:54:30

పేదలకు తోడుగా ...

పేదలకు తోడుగా ...

*ఉప్పల్‌ స్వరూప్‌రెడ్డినగర్‌లోని అభిసాయిదత్తా ట్రస్టు అనాథ పిల్లలకు మాజీ సైనికులు మర్రి ప్రభాకర్‌రెడ్డి, సుబ్బారావు, హమీదా గులాం రసూల్‌ సహకారంతో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, నేతలు శివారెడ్డి సరుకులు పంపిణీ చేశారు.  

*హబ్సిగూడ డివిజన్‌లో పద్మజా దవాఖాన ఆధ్వర్యంలో, మారి స్వచ్ఛంద సంస్థ, భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో, కాప్రా డివిజన్‌ కార్పొరేటర్‌ స్వర్ణరాజు శివమణి ఆధ్వర్యంలో పేదలకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీమ్‌ బీఎస్‌ఆర్‌ వ్యవస్థాపకుడు బేతి సుమంత్‌రెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 

*మల్కాజిగిరి సర్కిల్‌ కార్యాలయం వద్ద చౌదరి సమాజ్‌ మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్‌, వినాయక్‌నగర్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య, వలస కార్మికుల కు, అదేవిధంగా విష్ణుపురికాలనీలో   బ్రాహ్మణులకు ఎమ్మెల్యే హన్మంతరావు సరుకులు పంపిణీ చేశారు.

*అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌ సా యినగర్‌కాలనీ, రాజీవ్‌నగర్‌, ఇందిరానగర్‌, అంబేద్కర్‌నగర్‌లలో రేషన్‌ కార్డులేని వారికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్‌ సబితాకిశోర్‌ సరుకులు పంపిణీ చేశారు. 

*కార్పొరేటర్‌ బొబ్బ నవతారెడ్డి, బొబ్బ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరానగర్‌కు చెందిన 560 మంది పేదలకు  రూ.వెయ్యి విలువైన సరుకుల కిట్లను ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మె ల్యే అరెకపూడి గాంధీ అందజేశారు.

*రాష్ట్ర విశ్వకర్మ సంఘం నేత, టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌చారి ఆధ్వర్యంలో రాంనగర్‌ శివాలయంలో, కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని మారుతినగర్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ లాస్య నందిత సరుకులు పంపిణీ చేశారు.

*ఆజంపురా డివిజన్‌ పరిధిలోని మౌలిసాబ్‌కి మసీదు, ఖాసీబడా, నుక్కడ్‌, అంజుమన్‌ చౌరస్తా ప్రాంతాల్లో మలక్‌పేట ఎమ్మెల్యే బలాల 400 మందికి రేషన్‌ కిట్లను పంపిణీ చేశారు. 

*వివేకానందనగర్‌ డివిజన్‌ పరిధిలోని సప్తగిరి సీతారామాంజనేయ ఆలయంలో మాజీ కార్పొరేటర్‌ రంగారావు ఆధ్వర్యంలో పేద పురోహితులకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సరుకులు పంపిణీ చేశారు.  

*యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్‌ డివిజన్లలో పేదలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సరుకులు పంపిణీ చేశారు.

*బోరబండ డివిజన్‌ జయశంకర్‌ కమ్యూనిటీహాల్‌లో పాస్టర్లకు డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌   కూ రగాయలు, సరుకులు అందజేశారు.

*నల్లకుంట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నేత దూసరి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేదలకు బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. 

*గోషామహల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు.  

*నేరేడ్‌మెట్‌ డివిజన్‌ యాప్రాల్‌లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో 100మందికి సరుకులు పంపిణీ చేశారు.

*జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సీఆర్‌పీఎఫ్‌, మల్లెలగూడెం, అరుంధతినగర్‌, మల్కారంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్‌, విశ్రాంతమ్మ పోలీసులతో కలిసి పేదలకు సరుకులు పంపి ణీ చేశారు. అలాగే డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ పాపయ్యనగర్‌కాలనీలో పేదలకు ఆహార పొట్లాలను అందజేశారు.

*పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బీబీసాహెబ్‌మక్తా డివిజన్‌లో మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, కా ర్పొరేటర్‌ మాధవిరెడ్డి పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 

*మధురా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాచారంలోని రాఘవేంద్రనగర్‌, ఇందిరానగర్‌, రవీంద్రనగర్‌, అన్నపూర్ణకాలనీల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించారు. మల్లాపూర్‌లో ముస్లింలకు రంజాన్‌ కిట్లు, సరుకులు అందజేశారు. 

*దూరదర్శన్‌ ఉద్యోగుల సహకారంతో దూరదర్శన్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో తాత్కాలిక ఉద్యోగులకు, పారిశుధ్య సిబ్బందికి, పోలీసులకు దూరదర్శన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ టీఎస్‌ రామకృష్ణ, ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌, ఏసీపీ రాజు, హెడ్‌ ఆఫ్‌ ది ప్రోగ్రాం వి.రమాకాంత్‌, న్యూస్‌ డిప్యూటీ డైరెక్టర్లు కె.సుధాకర్‌రావు, సరుకులు అందజేశారు. 

*మండల పరిషత్‌ వైస్‌ ఎంపీపీ గం గుల శమంత ప్రభాకర్‌రెడ్డి నేదునూరు జీపీ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు. 

*గోల్కొండ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు నిర్మాణ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెడ్‌ మాస్టర్‌ మహ్మద్‌ బషీరుద్దీన్‌, సంస్థ ప్రతినిధులు రజనీశ్‌ స రుకులు, శానిటైజర్లను అందజేశారు. 

*దుర్గానగర్‌లోని బేతనియా సీజీఎం చర్చి ఆధ్వర్యంలో మల్కాజిగిరి పోలీసులకు పాస్టర్లు జాన్‌పాల్‌,బెన్‌హర్‌ బిర్యానీ పొట్లాలు అందజేశారు. 

*రంజాన్‌ సందర్భంగా మేడ్చల్‌లో ముస్లింలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికా, వైస్‌చైర్మన్‌ రమేశ్‌, కౌన్సిలర్లు సరుకులు పంపిణీ చేశారు.  

*మేడ్చల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో సఫాయి, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆశావర్కర్లకు టీఎన్‌జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌ పుట్టినరోజు సందర్భంగా జిల్లా టీఎన్‌జీవో ఆధ్వర్యంలో బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. 

*టీఆర్‌ఎస్‌ నాయకుడు సురేందర్‌గౌడ్‌ సంతాపసభ సందర్భంగా బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 

*ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌లో తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీశ్‌ అధ్యాపకులకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. 

*రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తెలు గు రాష్ర్టాల కో-ఆర్డినేటర్‌ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వలస కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు.  

*హిమాయత్‌నగర్‌లో పేదలకు టీఆర్‌ఎస్‌ నాయకుడు మహ్మద్‌ సర్ఫరాజ్‌ సరుకులు పంపిణీ చేశారు.

*కంటోన్మెంట్‌ ఏడో వార్డు చిన్న కమేళాలో బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌ బస్తీవాసులకు సరుకులు పంపిణీ చేశారు. 

*తార్నాక డివిజన్‌ లాలాపేట వినోభానగర్‌లో తార్నాక డివిజన్‌ టీ ఆర్‌ఎస్‌ నాయకులు యాదగిరి, శివ వికలాంగులకు సరుకులు పంపిణీ చేశారు. 

*నారాయణగూడ, హిమాయత్‌నగర్‌లో వివిధ ఆలయాల్లో పూజలు చేసే అర్చకులు, పేద బ్రాహ్మణులకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నగర ప్రచార కార్యదర్శి శ్రీధర్‌ సరుకులు అందజేశారు.

*ఎక్కాల సరోజిని, బీరప్ప చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కాచిగూడ డివిజన్‌లోని పేదలకు టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎక్కాల కన్నా సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. 

*లాఅండ్‌ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులకు బత్తాలు, నిమ్మకాయలను టీఆర్‌ఎస్‌ నాయకులు బానుక మల్లికార్జున్‌, బాణాల శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు 


logo