శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 15, 2020 , 23:54:26

స్టీల్‌ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయండి

స్టీల్‌ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయండి

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నం 3 చట్నీస్‌ సమీపంలో చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పనుల పురోగతిని  జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య తదితరులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి పనులు 75శాతం పూర్తి కావస్తున్నాయని , జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

పనుల పరిశీలన

వనస్థలిపురం:మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శుక్రవారం ఎల్బీనగర్‌ జోన్‌లో పర్యటించారు. మూసి రివర్‌ ఫ్రంట్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌తో కలిసి ఆయన పర్యటించారు. పతుల్లా గూడలో నిర్మిస్తున్న డీఆర్‌ఎఫ్‌ శిక్షణ కేంద్రం పనుల పురోగతిని పరిశీలించారు. నాగోల్‌ ఆర్టీవో కార్యాలయం నుంచి బండ్లగూడ వరకు, అల్కాపురి నుంచి మన్సూరాబాద్‌ వరకు ఉన్న రోడ్లను పరిశీలించారు.  


logo