ఆదివారం 31 మే 2020
Hyderabad - May 15, 2020 , 23:54:23

సిల్లీ రీజన్స్‌తో బయటకు రావద్దు : సీపీ సజ్జనార్‌

సిల్లీ రీజన్స్‌తో బయటకు రావద్దు :   సీపీ సజ్జనార్‌

సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఉల్లంఘనదారులపై కేసులు నమోదు చేస్తున్నామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన రోడ్లపై తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 9 లక్షల మందిపై వివిధ రకాలైన ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు నమోదు చేసి, 20591 వాహనాలు సీజ్‌ చేశామని,  ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపై కాంటాక్టు, నాన్‌కాంటాక్టు పద్ధతిలో ట్రాఫిక్‌ విభాగం 9,15,182 కేసులు నమోదు చేసిందని వివరించారు.


logo