శనివారం 30 మే 2020
Hyderabad - May 15, 2020 , 00:24:01

మరో 40 పాజిటివ్‌ కేసులు

మరో 40 పాజిటివ్‌ కేసులు

  • మీర్‌పేట్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి..

సిటీబ్యూరో: గ్రేటర్‌లో కొవిడ్‌ కేసుల హెచ్చుతగ్గుల పరంపర కొనసాగుతున్నది.  బుధవారం 31 కేసులు నమోదవ్వగా, తాజాగా  40 మందికి వైరస్‌ సోకింది.  హైదరాబాద్‌లో 34, మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో ఆరుగురు కొవిడ్‌ బారినపడ్డారు. రంగారెడ్డి జిల్లా  మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

  • జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి షాహీన్‌నగర్‌, ఎర్రకుంట కంటైన్మెంట్‌ జోన్లను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ పరిశీలించారు. పలు సూచనలు చేశారు.
  • ఆర్కేపురంలో విశ్రాంత ఉద్యోగితో పాటు ఆయన భార్యకు వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. తాజాగా న్యూ నాగోల్‌లో ఉంటు న్న సదరు రిటైర్డ్‌ ఉద్యోగి చిన్న కుమారుడితో పాటు ఆయన భార్య, కూతురు, చైతన్యపురి డివిజన్‌ సత్యనారాయణపురంలో నివాసముండే కూతురుకు పాజిటివ్‌గా తేలింది. తిరుమలానగర్‌కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కరోనాతో చనిపోగా, ఆయన కుటుంబసభ్యులు చికిత్స పొందుతున్నారు. మరికొందరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
  • మీర్‌పేట్‌ పరిధి సిర్లాహిల్స్‌ కాలనీకి చెందిన దంపతులకు పాజిటివ్‌ నిర్ధారణ కాగా, జిల్లెల్‌గూడలోని న్యూవివేకానగర్‌లో ఉండే వీరి కూతురు, అల్లుడు, మనువడు (9 నెలలు)కు వైరస్‌ సోకింది. 


logo