ఆదివారం 31 మే 2020
Hyderabad - May 15, 2020 , 00:24:02

రహదారుల పునరుద్ధరణ

రహదారుల పునరుద్ధరణ

  • జూన్‌ నాటికి 331కిలోమీటర్ల లక్ష్యం
  • 15 రోజుల్లో పనులు పూర్తి
  • మంత్రి కేటీఆర్‌ చొరవతో తొలిగిన ‘బీటీ’ అంతరాయం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రణాళిక (సీఆర్‌ఎంపీ) పనులు గడువుకంటే  ముందే పూర్తవుతున్నాయి. గురువారం నాటికి 235.60 కిలోమీటర్ల వరకు రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.  సీఆర్‌ఎంపీ కింద ఆరు జోన్లలో ఏడు ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. సుమారు రూ. 1800 కోట్ల వ్యయంతో 709.49 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించడంతోపాటు ఐదేండ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో జూన్‌ వరకు 331 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు పూర్తిచేయాల్సి ఉండగా  235.60 కిలోమీటర్ల పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పనులు 15 రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. 

మంత్రి కేటీఆర్‌ చొరవతో.. 

 రోడ్ల పునరుద్ధరణతోపాటు సెంట్రల్‌ మీడియన్ల అభివృద్ధి, పారిశుధ్య పనులు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు తదితర పనులు కూడా నిర్వహిస్తున్నారు. మార్చిలో పనులు చేపట్టగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ లేకపోవడంతో పనులు వేగంగా కొనసాగాయి. మొదట బీటీ రవాణాలో సమస్య తలెత్తినప్పటికీ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులతో సంప్రదించి బీటీ వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పనులు వేగంగా పూర్తవుతున్నాయి.


logo