శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 15, 2020 , 00:24:03

శంషాబాద్‌కు చేరుకున్న ‘వందే భారత్‌'

శంషాబాద్‌కు చేరుకున్న ‘వందే భారత్‌'

శంషాబాద్‌: ప్రపంచం మొత్తం కొవిడ్‌-19లో చిక్కుకున్న విపత్కర పరిస్థితుల్లో వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి తీసుకువస్తున్నారు. గురువారం తెల్లవారు జామున మనీలా నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు ఏఐ 1612 విమానం 149 మంది ప్రయాణికులతో వచ్చింది. వాషింగ్టన్‌ నుంచి ఢిల్లీ మీదుగా మరో విమానం (ఏఐ 104 )163 మందితో దిగింది. వివిధ దేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న వీరందరికి నిబంధనల మేర పరీక్షలు జరిపారు.


logo