శనివారం 30 మే 2020
Hyderabad - May 15, 2020 , 00:24:15

స్వచ్ఛంద సేవలు అమోఘం

స్వచ్ఛంద సేవలు అమోఘం

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

అబిడ్స్‌: లాక్‌డౌన్‌లో ప్రభుత్వానికి అండగా పలు సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవకు అండగా నిలిచాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. జ్వంగెల్‌ సంస్థ నిర్వాహకులు రాజ్‌.ఎన్‌.ఫణి, ఈ యంత్ర నిర్వాహకులు చంచల్‌ రాజోర్‌లతో కలిసి పోలీసులకు, వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్లను, 500 శానిటైజర్లను గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ నివారణకు వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి అమోఘమన్నారు.  రాజ్‌.ఎన్‌.ఫణిని, చంచల్‌ రాజోర్‌లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అభినందించారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయించండి

 బేగంపేట: లాక్‌డౌన్‌ సమయంలోనే అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తన నియోజకవర్గ కార్పొరేటర్లకు సూచించారు. గురువారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో కార్పొరేటర్లతో కలిసి అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు.అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు అరుణ, తరుణి, శేషుకుమారి, హేమలత, లక్ష్మి, రూప పాల్గొన్నారు.logo