గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 14, 2020 , 00:40:30

ఆన్‌లైన్‌లో ఎంట్రీ.. హోం క్వారంటైన్‌ స్టాంపు

ఆన్‌లైన్‌లో ఎంట్రీ.. హోం క్వారంటైన్‌ స్టాంపు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశంలోని పలు ప్రాంతాల నుంచి శ్రామిక్‌ రైళ్లలో సికింద్రాబాద్‌కు చేరుకుంటున్న వారి వివరాలను అధికారులు ఆన్‌లైన్లో నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చిన వారికి హోం క్వారంటైన్‌ స్టాంపులు వేసి ఇండ్లకు పంపిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యం, రైల్వేశాఖ సిబ్బంది స్టేషన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఆయా శాఖలను సమన్వయం చేసేందుకు సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజినల్‌ అధికారి(ఆర్డీవో) వసంతకుమారిని నోడల్‌ అధికారిగా జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి నియమించారు. ఇద్దరు తహసీల్దార్లు, స్పెషల్‌ ఆర్‌ఐ, వీఆర్‌వోలు, జూనియర్‌ అసిస్టెంట్లను సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద నియమించుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన వారిని స్వస్థలాలకు చేర్చే వరకు వీరంతా సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్దే విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


logo