శనివారం 30 మే 2020
Hyderabad - May 12, 2020 , 23:50:24

గడ్డిఅన్నారం మార్కెట్‌ యార్డుకు సెలవు

గడ్డిఅన్నారం మార్కెట్‌ యార్డుకు సెలవు

ఎల్బీనగర్‌ : కొందరు కమీషన్‌ ఏజెంట్లు కరోనా కట్టడి చర్యలు తీసుకోవడంలో  అలసత్వం వహిస్తున్నందున గడ్డిఅన్నారం మార్కెట్‌ యార్డు కార్యకలాపాలను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌ ఎస్‌జీఎస్‌ వెంకటేశం తెలిపారు.  మార్కెట్‌ యార్డు లో భౌతికదూరం పాటించడం, మాస్కులను ధరించడం, ఉమ్మి వేయకూడదనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. 

మాతం ర్యాలీ రద్దు

చార్మినార్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి  రంజాన్‌లోని 21వ రోజున  చేపట్టనున్న ర్యాలీని రద్దు చేస్తున్నామని ఆల్‌ ఇండియా షియా కౌన్సిల్‌ సభ్యుడు జాఫర్‌ ఇమామ్‌ తెలిపారు.  ఎవరికి వారుఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చుకోవాలని సూచించారు.

 మెరుగైన రవాణే లక్ష్యం : ఎమ్మెల్యే  

మాదాపూర్‌:  మెరుగైన రవాణా కోసమే రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం మాదాపూర్‌ డివిజన్‌ పరిధిలోని మాతృశ్రీనగర్‌, భిక్షపతినగర్‌, జైహింద్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీల్లో రూ. కోటి 15 లక్షల 50 వేలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్‌, డీజీఎం నారాయణ, నాగప్రియలతో సమీక్ష నిర్వహించి డ్రైనేజీ సమస్యను పరిష్కారించాలని కోరారు. 


logo