ఆదివారం 31 మే 2020
Hyderabad - May 12, 2020 , 23:25:19

గ్రేటర్‌లో 37 కేసులు

గ్రేటర్‌లో 37 కేసులు

 • చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
 • సిటీబ్యూరో: గ్రేటర్‌లో మంగళవారం 37 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం గరిష్టంగా 79 నమోదు కాగా..  ఒక్కరోజులోనే సగం వరకు కేసు లు తగ్గాయి. దీంతో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య 70కి చేరుకున్నది. ఈజోన్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు విస్తృతంగా పారిశుధ్య, రసాయనాల పిచికారీ చేపడుతున్నారు. ఆయా జోన్లలోని వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
 • కంటైన్మెంట్‌ జోన్ల వివరాలు..
 • ఎల్బీనగర్‌ జోన్‌ : కాప్రా సర్కిల్‌-2, ఉప్పల్‌-3, హయత్‌నగర్‌-2, ఎల్బీనగర్‌-3,సరూర్‌నగర్‌-3, మొత్తం-13.
 • చార్మినార్‌ జోన్‌ : మలక్‌పేట్‌ సర్కిల్‌ -11, సంతోష్‌నగర్‌-3, చాంద్రాయణగుట్ట-1, చార్మినార్‌-5, ఫలక్‌నుమా-6, మొత్తం- 26.
 • ఖైరతాబాద్‌ జోన్‌ : మెహిదీపట్నం- 1, కార్వాన్‌-10, ఖైరతాబాద్‌-6, జూబ్లీహిల్స్‌-1, మొత్తం- 18.
 • సికింద్రాబాద్‌ జోన్‌: ముషీరాబాద్‌-2, అంబర్‌పేట్‌-2, మల్కాజిగిరి-2, సికింద్రాబాద్‌-1, బేగంపేట్‌-2, మొత్తం- 9.
 • శేరిలింగంపల్లి జోన్‌ : శేరిలింగంపల్లి-2, మొత్తం- 2
 • కూకట్‌పల్లి జోన్‌ : మూసాపేట్‌-1, గాజులరామారం-1, మొత్తం-2. 
 • కరోనాతో ఇద్దరు మృతి 
 • జియాగూడ: జియాగూడ డివిజన్‌  ఇందిరానగర్‌కు చెందిన ఓ వ్యక్తి(60) అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు వెళ్లగా వైద్యులు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించి గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని కుల్సుంపురా పోలీసులు తెలిపారు. అలాగే మూసాబౌలికి చెందిన వృద్ధుడు(61) చికిత్స పొందుతూ రక్తపోటుకు గురై మృతి చెందాడు. వేంకటేశ్వరనగర్‌, ఇందిరానగర్‌, ఇక్బాల్‌గంజ్‌ ప్రాంతాల్లో మంగళవారం 10 మంది అనుమానితులను దవాఖానలకు తరలించారు.
 • బడంగ్‌పేట: మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సిర్లాలో నివా సముంటూ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
 • మాదన్నపేట: వినాయక్‌నగర్‌లో అమెజాన్‌లో పనిచేసే వ్యక్తికి, తన కూతురు(11)కు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని గాంధీకి తరలించి అక్క డ రసాయనాలతో పిచికారీ చేశారు.
 • రామంతాపూర్‌: ఉప్పల్‌ భరత్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు దవాఖానకు తరలించి అతని కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 
 • సైదాబాద్‌: డివిజన్‌ మాధవనగర్‌ కాలనీలో హోంక్వారంటైన్‌లో ఓ కిరాణాషాపు కుటుంబ సభ్యుల్లో షాపు యజమాని భార్య(52)కు పాజిటివ్‌ రావటంతో గాంధీకి తరలించారు.
 • చార్మినార్‌: మూసాబౌలి దర్జీగల్లీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీకి పంపించి, కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.  
 • ఛత్రినాక లక్మీనగర్‌లో ఓ కుటుంబానికి కరోనా సోకడంతో క్వారంటైన్‌ తరలించిన విషయం తెలిసిందే. అయితే వీరితోపాటు ఆ బస్తీలోని 56 మందిని  సరోజిని, యునానీ దవాఖానలో క్వారంటైన్‌కు తరలించగా, కరోనా లక్షణాలు లేకపోవడంతో మంగళవారం వారిని ఇండ్లకు పంపించారు.  
 • వనస్థలిపురం:వనస్థలిపురంలోని కంటైన్మెంట్‌ జోన్లలో 52మంది అధికారులు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటా (2,481ఇండ్లలో 8,808 మందిని) సర్వే చేశారు. మన్సూరాబాద్‌ డివిజన్‌ ఇందిరానగర్‌లో ఓవ్యక్తి జ్వరంతో బాధపడుతుండటంతో ఫీవర్‌  దవాఖానకు, కమలానగర్‌ లోని వ్యక్తిని హోంక్వారంటైన్‌ చేశారు. 
 • అల్వాల్‌: అల్వాల్‌ ప్రగతిశీల కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతడితోపాటు కుటుంబసభ్యులు ముగ్గురిని గాంధీకి తరలించారు. 


logo