శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 12, 2020 , 23:56:03

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

బేగంపేట: కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, హౌసింగ్‌, జలమండలి శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఉన్నందున రోడ్లు, పైపులైన్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని  నియోజకవర్గంలోని అన్ని నాలాల్లో పూడికతీత పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. నియోజవర్గంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.  కార్పొరేటర్లు, సెంట్రల్‌, నార్త్‌ జోనల్‌ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, లావణ్య, జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకట్‌దాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.logo