మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - May 12, 2020 , 23:20:37

కరోనా కట్టడిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

కరోనా కట్టడిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

భువనగిరి : కరోనా కట్టడిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని మాజీ ఎమ్మెల్యే, ఆలేరు జడ్పీటీసీ డాక్టర్‌ కుడుదుల నగేశ్‌ అన్నారు. ఆయన సౌజన్యంతో భువనగిరి జర్నలిస్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు.  భువనగిరి పట్టణంలోని బీచ్‌మహెల్లా పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నగేశ్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్‌ కట్టడికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా తమ ఆరోగ్య భద్రతను సైతం లెక్కచేయరని కొనియాడారు. కార్యక్రమంలో జర్నలిస్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే హమీద్‌పాషా, దయాకర్‌, జర్నలిస్టులు సొల్లేటి గోవర్ధనాచారి, రవీంద్రనాథ్‌, ఇబ్రహీం, చెన్నయ్య, సురేశ్‌రెడ్డి, మత్యాస్‌, రామకృష్ణ, నర్సింహాచారి, ఫిరోజ్‌, నరేశ్‌, సంతోష్‌, జగదీశ్‌, శ్రీనివాస్‌, జలంధర్‌, సమీ, రాము, శంకర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo