మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - May 12, 2020 , 23:18:08

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలి

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలి

భువనగిరి : వానకాలం పంటలకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. కలెక్టర్‌ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమావేశమై మాట్లాడారు. రైతులకు సరిపడ ఎరువులు, విత్తనాలు డీలర్‌ షాపుల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి, చిరుధాన్యాల  పంటలను ప్రోత్సహించాలని సూచించారు. విత్తనాలను లైసెన్స్‌ ఉన్న కంపెనీల నుంచి తెప్పించి రసీదుతో కూడిన విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో డీలర్లు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉందని, దీన్ని నివారించేందుకు అధికారులు అప్రమత్తం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, సహకార అధికారి వెంకట్‌రెడ్డి, ఉద్యానశాఖ అధికారి సురేశ్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo