ఆదివారం 31 మే 2020
Hyderabad - May 12, 2020 , 00:00:34

ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

జీడిమెట్ల: పాతకక్షలతో ఆటోడ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన మాజీ రౌడీ షీటర్‌ ఎండీ. ఫయాజ్‌ (28) ఆటో డ్రైవర్‌. రిక్షాపుల్లర్స్‌ కాలనీకి చెందిన మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌తో ఫయాజ్‌ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ప్రశాంత్‌, స్నేహితులు టిల్లు, సాయి, నరేశ్‌లతో కలిసి సోమవారం కాలనీలో ఫయాజ్‌ను కత్తులతో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తం జగద్గిరిగుట్ట సీఐ సంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి మృతదేహాన్ని  గాంధీ మార్చురీకి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్‌ టీంను ఏర్పాటు చేసినట్లు  ఏసీపీ తెలిపారు. 


logo