బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 11, 2020 , 23:50:30

రూ. 167.52 కోట్ల ఆస్తిపన్ను

రూ. 167.52 కోట్ల ఆస్తిపన్ను

  • 5 శాతం రాయితీతో 31 వరకు గడువు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ కింద 2020-21కి గాను సోమవారంనాటికి జీహెచ్‌ఎంసీకి  రూ. 167.52 కోట్ల పన్ను వసూలైంది. ఈ నెల 31వరకు బకాయి లేకుండా పూర్తిగా వార్షిక పన్ను చెల్లించేవారికి ఈ పథకం కింద ఐదు శాతం రాయితీ కల్పిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 16.23 లక్షల అసెస్‌మెంట్లు ఉండగా, వాటిపై రూ. 1456.58 కోట్లమేర పన్ను డిమాండ్‌ ఉన్నది. ఎర్లీబర్‌ ఆఫర్‌ కింద గతేడాది రూ. 536 కోట్లమేర పన్ను మొదటి నెల (ఏప్రిల్‌)లోనే వసూలు కాగా, ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఇప్పటివరకు రూ. 167.52 కోట్లు మాత్రమే వసూలైంది. రాయితీని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.logo