బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 11, 2020 , 23:50:33

కొవిడ్‌ గుర్తింపునకు కృత్రిమ మేధస్సు దోహదం

కొవిడ్‌ గుర్తింపునకు కృత్రిమ మేధస్సు దోహదం

  • నేషనల్‌ టెక్నాలజీ డే సదస్సులో వక్తలు

ఖైరతాబాద్‌: కొవిడ్‌19ను గుర్తించే పరీక్షల్లో అధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం జరుగుతుంది. అందులో కృత్రిమ మేధస్సు ఎంతో దోహదపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.  ఇనిస్టిట్యూట్‌షన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జూమ్‌ క్లౌడ్‌ యాప్‌ ద్వారా ‘డాటా అనలిస్టిక్స్‌ అండ్‌ చాలెంజెస్‌ ఇన్‌ అనలైజింగ్‌ కరోనా వైరస్‌ - కొవిడ్‌ డాటా’ అనే అంశంపై వీడియో ప్యానెల్‌ డిస్కషన్‌ జరిగింది. ఐఈఐ చైర్మన్‌ డాక్టర్‌ జి. రామేశ్వర్‌రావు, కార్యదర్శి టి. అంజయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో (ఆర్‌అండ్‌డీ) మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఐవీ మురళీకృష్ణ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ద్వారా కరోనా పరీక్షలు చేయడం ద్వారా భౌతిక దూరం పాటిస్తూనే వారి వివరాలను సేకరించవచ్చన్నారు. కరోనా పాజిటివ్‌, నెగిటివ్‌ వచ్చిన వారి వివరాలను సేకరించడంతో పాటు వచ్చిన వ్యక్తికి ఎలా తగ్గించాలన్న అంశాన్ని కూడా ఈ పరిజ్ఞానంతో అంచనా వేయవచ్చన్నారు. ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ మాజీ వీసీ డాక్టర్‌ అల్లం అప్పారావు, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీఎన్‌ కృష్ణమూర్తి, వరంగల్‌ ఎన్‌ఐటీ  ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీరాం జి. సంజీవీ, టెక్‌ మహింద్రా విజిటింగ్‌ ప్రొఫెసర్‌  డాక్టర్‌ రంగారావు కాలూరి, సీఆర్‌ రావు అడ్వాన్స్‌డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌ స్టాటిటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ శిరీష వెల్లంపల్లి, అపోలో ఆస్పత్రి ఆర్టిఫీషిల్‌ ఇంటిజెన్స్‌ విభాగం వైద్యాధికారి డాక్టర్‌ వేదాల రామకృష్ణ పాల్గొన్నారు. 


logo