శనివారం 30 మే 2020
Hyderabad - May 11, 2020 , 01:19:56

త్వరలో బయోగ్యాస్‌ ప్లాంట్‌..

త్వరలో బయోగ్యాస్‌ ప్లాంట్‌..

  • బోయిన్‌పల్లి మార్కెట్‌యార్డును సందర్శించిన మంత్రి తలసాని

కంటోన్మెంట్‌, మే 10 (నమస్తే తెలంగాణ) : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని  మంత్రి తలసాని అన్నారు. ఆదివారం బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ను సందర్శించి, కరోనా నియంత్రణకు చర్యలు, మార్కెట్‌లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్‌ ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి   వెల్లడించారు. కరోనా నియంత్రణకు  మార్కెట్‌లోకి ప్రవేశించేటప్పుడు శానిటైజ్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, సభ్యుడు కె.పాండుయాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ టీఎన్‌. శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ఉదయ్‌, ఎంపిక శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్‌, డైరెక్టర్లు దేవులపల్లి శ్రీనివాస్‌, ఉమావతిగౌడ్‌ , బాలరాజు, బాలమల్లు, మాజీ డైరెక్టర్‌ మాడిశెట్టి గిరిధర్‌, హోల్‌సేల్‌ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సోమదేవేందర్‌రెడ్డి, ప్రతినిధులు మిర్యాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo