సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 11, 2020 , 01:19:57

గ్రేటర్‌లో 26 కరోనా పాజిటివ్‌ కేసులు

గ్రేటర్‌లో 26 కరోనా పాజిటివ్‌ కేసులు

సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆదివారం మరో 26 కేసులు నమోదయ్యాయి. ఇందులో 20 కేసులు ఇదివరకు పాజిటివ్‌ వచ్చి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినవి కాగా, మిగిలిన ఆరు కేసులకు సంబంధించిన కాంటాక్ట్‌ హిస్టరీ తెలియాల్సి ఉంది. గ్రేటర్‌లోని హైదరాబాద్‌లో 22 కేసులు, రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో 3 కేసులు, సరూర్‌నగర్‌లో ఒక కేసు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.

  • జియాగూడ డివిజన్‌ పరిధిలోని శ్రీ సాయినగర్‌లో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. అలాగే ఇందిరానగర్‌లో ఇటీవల వైరస్‌ సోకిన మహిళ కోడలుకు పాజిటివ్‌ వచ్చింది. 
  • కరోనాతో బర్కత్‌పురాకు చెందిన మాజీ పోస్టు మాస్టర్‌ కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయాడు. 
  • బేగంబజార్‌లోని బీదర్‌వాడిలో నివసించే వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. తాజాగా అతడి కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి వైరస్‌ సోకింది.  
  • హయత్‌నగర్‌ డివిజన్‌ హుడాసాయినగర్‌కు చెందిన సాప్ట్‌వేర్‌ఇంజినీర్‌తో పాటు ఆయన భార్య, పిల్లలకు పాజిటివ్‌ రాగా, ఆ నివాసంలో ఉంటున్న మరో 11 మందికి పరీక్షలు చేసి పంపించారు. వారిలో మరో ఐదుగురికి ఇప్పటికే కరోనా ఉన్నట్లుగా తేలింది. తాజాగా వారి ఇంట్లో పనిచేసే పనిమనిషికి వైరస్‌ సోకింది. అలాగే  వనస్థలిపురం ఏ టైపు కాలనీలో పాజిటివ్‌ వచ్చిన మహిళ నివాసంలో పనిచేసే డ్రైవర్‌, అతడి భార్యకు కూడా కరోనా వచ్చింది.  


logo