మంగళవారం 26 మే 2020
Hyderabad - May 11, 2020 , 01:20:04

1282 మెట్రిక్‌ టన్నుల బియ్యం

1282 మెట్రిక్‌ టన్నుల బియ్యం

  • 28 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు
  • 674 చౌకధరల దుకాణాల్లో అందజేత

సిటీబ్యూరో: నగర పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్నది. నగరంలోని  674 చౌకధరల దుకాణాల ద్వారా 429990 కార్డుదారులకు మే నెల కోటా కింద దాదాపు 1282 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేశారు. అదేవిధంగా మే నెల నుంచి ప్రతీకార్డుపై ఉచితంగా అందజేస్తున్న కిలో కందిపప్పును 28 మెట్రిక్‌ టన్నులను లబ్ధిదారులకు అందజేశారు. కరోనా నేపథ్యంలో కార్డుపై ఉన్న సభ్యులకు ఒకొక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో బియ్యం అందలేదని ఫిర్యాదులు రావడంతో మే నెలలో కట్టుదిట్టం చేశారు.  బియ్యం తీసుకోకున్నా తమ పేరు మీద ఎవరో తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో  మే నెల కోటాను పారదర్శకంగా అందిచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ సీఆర్వో పరిధిలో కొన్ని అక్రమాలు జరుగగా డీసీఎస్‌వో పద్మను నివేదిక అడిగారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకుని  రేషన్‌ పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు అందేవిధంగా ఉపాధ్యాయులకు రేషన్‌ పంపిణీ బాధ్యతలు అప్పగించారు. 


logo