శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 11, 2020 , 01:20:02

కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

సిటీబ్యూరో: అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌కు చెందిన కానిస్టేబుళ్లు డి.పంచ ముకేశ్‌, సురేశ్‌ ఎంజే మార్కుట్‌ పరిసరాల్లో ఓ పండ్ల వ్యాపారి ఆటోను ఆపి డబ్బులు వసూలు చేశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయింది.  ఈ ఘటనపై విచారణ చేపట్టి..ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశామని, సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేనందుకు అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌కు చార్జీ మెమో జారీ చేసినట్లు సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

  • ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌లోని చింతలబస్తీకి చెందిన గర్భవతి లక్ష్మికి ఆదివారం సాయంత్రం 7గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు డయల్‌ 100కు సమాచారం అందించగా, ఎస్సై నరేశ్‌ నేతృత్వంలో సిబ్బంది ఆమెను నిలోఫర్‌ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
  • శామీర్‌పేట: మల్కాజిగిరికి చెందిన కనకల శ్రీకాంత్‌కు లాల్‌గడిమలక్‌పేట గ్రామానికి చెందిన మౌనిక(24)తో 2017లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్దల సమక్షంలో భర్త వద్దకు వెళ్లాలని ఒప్పందం చేశారు. దీంతో శనివారం రాత్రి మౌనిక ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. 
  • శామీర్‌పేట: లక్ష్మాపూర్‌ తండాకు చెందిన రమేశ్‌నాయక్‌  బైక్‌పై గ్రామా నికి వస్తుండగా కర్కపట్ల నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి.
  • ఉప్పల్‌: రామంతాపూర్‌లోని ఓ మద్యం షాపులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు డెకాయి ఆపరేషన్‌ నిర్వహించి వైన్‌షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. 


logo