గురువారం 28 మే 2020
Hyderabad - May 11, 2020 , 01:20:12

వైద్యులకు అపూర్వ స్వాగతం

వైద్యులకు అపూర్వ స్వాగతం

బడంగ్‌పేట: 45 రోజులుగా ఉస్మానియాలో రోగులకు వైద్యసేవలు అందించిన బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బాలాపూర్‌కు చెందిన డాక్టర్‌ బొర్ర మనీశ్‌ కుమార్‌రెడ్డికి బస్తీవాసులు అపూర్వ స్వాగతం పలికారు.   

వైద్యాధికారికి ఆత్మీయ స్వాగతం.. 

 సిటీబ్యూరో: పెద్దపల్లి జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుం డా కృషి చేసిన డీఎంహెచ్‌వో పగిడి సుధాకర్‌కు హైదరాబాద్‌ నగరంలో శనివారం రాత్రి ఆత్మీయ స్వాగతం లభించింది.  ప్రస్తుతం పెద్దపల్లి డీఎంహెచ్‌వోగా విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్‌ సెలవుపై కర్మాన్‌ఘాట్‌ విరాట్‌నగర్‌లోని తన ఇంటికి రాగా విరాట్‌నగర్‌, గ్రీన్‌ ఎస్టేట్‌కాలనీ ప్రజలు చప్పట్లతో స్వాగతం పలికారు. రామగుండంలో ఏప్రిల్‌లో 2 పాజిటివ్‌ కేసులు నమోదు కాగానే అక్కడి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే కంటైన్మెంట్‌ జోన్‌ గా ప్రకటించి 8 లక్షల మందికి స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేశారు. ముందు జాగ్రత్త చర్యల వల్ల పెద్దపల్లి కరోనా రహిత గ్రీన్‌ జోన్‌గా మారింది. కరోనా కట్టడిలో డీఎంహెచ్‌వో కీలక పాత్ర వహించినందుకు స్వాగతం పలికినట్లు స్థానికులు తెలిపారు.


logo