శనివారం 30 మే 2020
Hyderabad - May 10, 2020 , 00:08:24

సిటీలో మరో 30 పాజిటివ్‌ కేసులు..

సిటీలో మరో 30 పాజిటివ్‌ కేసులు..

గ్రేటర్‌లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య మరోసారి ఎగబాకింది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య శనివారం ఒక్కసారిగా 30కి చేరింది. తాజాగా నమోదైన వాటిలో 21  కేసులు నగరంలోనే నమోదవ్వడం గమనార్హం. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లిలో ఒకే కుటుంబంలో  7కేసులు, రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. సుల్తాన్‌బజార్‌లో ఒకే కుటుంబంలోని ముగ్గురితో పాటు వివిధ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ పరిధిలో కరోనాతో ఒకరు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. 

l అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. గూడ్స్‌షెడ్‌ రోడ్డులో హమాలీగా పని చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతడి కుటుంబసభ్యులను పరీక్షలకు తరలించారు. వారిలో ఏడుగురికి వైరస్‌ సోకింది. 

కవాడిగూడ భాగ్యలక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న ఓ యువకుడికి అతని బంధువు అయిన యువతికి ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. వారిప్పుడు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రాథమికంగా వారు కలిసిన మరో 11 మందిని మున్సిపల్‌, పోలీస్‌, వైద్యాధికారులు గుర్తించి వారిని వైద్య పరీక్షల నిమిత్తం శనివారం సరోజినిదేవి దవాఖానకు అంబులెన్స్‌లో తరలించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ హయత్‌నగర్‌ సర్కిల్‌లోని హయత్‌నగర్‌ డివిజన్‌ హుడా సాయినగర్‌లోని కరోనా నియంత్రిత ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కాలనీలో ఒకే ఇంట్లో ఉండే 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ ప్రాంతంలో తీసుకుంటున్న జాగ్రత్తలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ప్రాథమికంగా కలిసిన వారందరికీ పరీక్షలు చేయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, ఉప కమిషనర్‌ మారుతీ దివాకర్‌, మెడికల్‌ అధికారి కరుణశ్రీ, ఏఎంవోహెచ్‌ డాక్టర్‌ మంజుల వాణి, డిప్యూటీ డీఎంవోహెచ్‌ భీమా నాయక్‌, నోడల్‌ అధికారి రాజారావు, చల్లా విజేందర్‌రెడ్డి ఉన్నారు. 

ఎల్బీనగర్‌ సర్కిల్‌ హస్తినాపురం డివిజన్‌లోని సంతోషిమాత కాలనీ నుంచి నార్త్‌ ఎక్స్‌టెన్షన్‌ కాలనీ వరకు మార్నింగ్‌ వాక్‌లో భాగంగా కార్పొరేటర్‌ పద్మానాయక్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు అడ్డుగా వచ్చే ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలను తొలిగించి పక్కకు ఏర్పాటు చేయిస్తామన్నారు. కస్తూరి కాలనీ నుంచి కేకే గార్డెన్స్‌ వరకు ట్రంక్‌లైన్‌ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ రూపిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, ఉప కమిషనర్‌ విజయకృష్ణ, నాయకులు పాల్గొన్నారు. logo