బుధవారం 27 మే 2020
Hyderabad - May 10, 2020 , 01:12:56

సీజ్‌ చేసిన వాహనాల రిలీజ్‌

సీజ్‌  చేసిన వాహనాల రిలీజ్‌

హైదర్‌నగర్‌: లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై తిరిగిన వాహనాలను కేపీహెచ్‌బీ పోలీసులు సీజ్‌ చేశారు. ఈ వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో శనివారం కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ బండి ధ్రువపత్రాలు, చలాన్లకు సంబంధించిన బాండ్లను తీసుకొని 180 వాహనాలను యజమానులకు అప్పగించారు.

కాచిగూడ: కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టూరిస్ట్‌ హోటల్‌, నింబోలిఅడ్డా, బర్కత్‌పుర, గోల్నాక, చాదర్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వాహనాల తనిఖీలో 107 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అడ్మిన్‌ ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపారు.


logo