శనివారం 30 మే 2020
Hyderabad - May 10, 2020 , 00:08:26

సైబర్‌మోసాలు..

సైబర్‌మోసాలు..

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కి నగరానికి చెందిన పలువురు మోసపోయారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగి రూ. 2,999 వెచ్చించి గ్యాడ్జెట్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో రెడ్‌మీ నోట్‌ కొనుగోలు చేశాడు. డబ్బు చెల్లించినా ఫోన్‌ ఇంటికి రాకపోవడంతో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసి అందులో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయడంతో సైబర్‌నేరగాళ్లు గ్యాడ్జెట్‌ స్టోర్స్‌ ప్రతినిధులమని, మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పండంటూ, అన్ని వివరాలు తీసుకొని ఖాతాలో రూ.92లను వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. 

మరోఘటనలో ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలను చూసి ఏసీ కొందామనుకున్న ఓ మహిళ సైబర్‌నేరగాళ్ల చేతిలో చిక్కి రూ. 32 వేలు పొగొట్టుకుంది. తాము ఆర్మీ అధికారులమని, మిలటరీ ట్రాన్స్‌పోర్టు పనిచేస్తుందని, దాని ద్వారా మీకు ఏసీని డెలివరీ చేస్తామంటూ నమ్మించి డబ్బును కాజేశారు.

మరో ఘటనలో సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌గా పనిచేస్తున్న బన్నిసింగ్‌కు, తన బావమర్ది పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు బంధువులు ప్రమాదానికి గురయ్యాడని, అర్జెంట్‌గా డబ్బులు పంపించమంటూ అందులో ఒక బ్యాంకు ఖాతా నంబర్‌ను పంపించారు. ఇది నిజమని నమ్మి, వెంటనే ఆ ఖాతాకు రూ. 35 వేలు పంపించాడు. ఆ తరువాత బావమర్దికి ఫోన్‌ చేసి వివరాలు అడగడంతో తాను ఎలాంటి ఈమెయిల్స్‌ పంపించలేదంటూ చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించి శనివారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


logo