శనివారం 30 మే 2020
Hyderabad - May 10, 2020 , 00:08:26

అన్నదాత సుఖీభవ

అన్నదాత సుఖీభవ

  • సొంత ఖర్చులతో 6వేల మందికి భోజనం 
  • పేద బ్రాహ్మణుడి ఔదార్యం 

సిటీబ్యూరో: మండుటెండలో ఆకలి గొన్నవారికి కడుపారా భోజనం పెట్టడం అతిపెద్ద ఔదార్యం. శ్రీమంతుడు కాకపోయినా అన్నార్తులకు ఆదుకోవాలనే తపనతో ఓ పేద బ్రాహ్మణుడు ఏకంగా సుమారు 6వేల మందికి భోజనం పెట్టాడు. సంతోష్‌నగర్‌కు చెందిన రవీందర్‌ శర్మ క్యాటరింగ్‌ వృత్తి నిర్వాహకుడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వలస కార్మికుల క్షద్బాధ చూసి చలించిపోయాడు. సొంత ఖర్చులతో ఇంట్లో వంట చేసి ప్రతిరోజూ 150 మందికి భోజనం పెడుతూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించిన అన్నదానం లాక్‌డౌన్‌ ముగిసేవరకు కొనసాగనుందని ఆయన తెలిపాడు. తన ద్విచక్రవాహనంపై ఆహారపదార్థాలను పార్సిల్‌ చేసి సంతోష్‌నగర్‌ నుంచి తీసుకెళ్లి కర్మన్‌ఘాట్‌, ఒవైసీ ఆసుపత్రి, మంద మల్లమ్మ ఫంక్షన్‌ హాల్‌, దోబిఘాట్‌ చౌరస్తాల్లో రోజూ పంపిణీ చేస్తున్నారు. అన్నం, పప్పు, సాంబార్‌, పులిహోరలను రుచికరంగా వండి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. పండుగ సమయాల్లో వాటితో పాటు స్వీట్లను కూడా అందిస్తున్నారు. ఈ క్రతువులో తన సతీమణి ఎంతగానో సహకారం అందిస్తున్నదని రవీందర్‌ శర్మ చెప్పారు. 


logo