ఆదివారం 31 మే 2020
Hyderabad - May 10, 2020 , 01:12:57

150 వాణిజ్య సంస్థలు సీజ్‌

150 వాణిజ్య సంస్థలు సీజ్‌

  • నిబంధనల అమలు కోసం ప్రత్యేక బృందాలు 

సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ కొనసాగిస్తూనే పలు అవసరమైన వస్తువులు ఉత్పత్తికి, ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పని చేసేందుకు ప్రభుత్వం షరతులతో అనుమతించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచే నగరం సందడిగా మారింది. వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రహదారులపై నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనలకు నీళ్లొదిలిన 150 సంస్థలను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌-విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) విభాగం సీజ్‌చేసింది. ఇలా సీజ్‌ అయిన వాటిలో డీ-మార్ట్‌, రత్నదీప్‌ సూపర్‌మార్కెట్‌, కరాచీ బేకరీ, బికనేర్‌వాలా, విశాల్‌ మెగా మార్ట్‌, ఉషోదయ సూపర్‌ మార్కెట్‌, విజేత సూపర్‌ మార్కెట్‌, వ్యాల్యు మార్ట్‌, ఫుడ్‌ అండ్‌ లాండ్‌ సూపర్‌ మార్కెట్‌ తదితర ప్రముఖ సంస్థలతోపాటు జిమ్‌లు, స్కూళ్లు, సూపర్‌ మార్కెట్లు, ఫంక్షన్‌హాళ్లు, కోచింగ్‌ సెంటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, స్టెడీ హాల్స్‌, తదితర సంస్థలు ఉన్నాయి. నిబంధనలను పాటించకపోతే చర్యలు తప్పవని ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజీత్‌ కంపాటి స్పష్టంచేశారు. 


logo