బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 08, 2020 , 23:36:33

‘గాంధీ’కి వెయ్యి పీపీఈ కిట్లు

‘గాంధీ’కి వెయ్యి పీపీఈ కిట్లు

బన్సీలాల్‌పేట్‌ : కరోనా బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి కేరాఫ్‌గా గాంధీ దవాఖాన నిలవడం తెలంగాణకే గర్వకారణమని  మంత్రి తలసాని  అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖాన వైద్యుల కోసం భావేశ్‌ అనే వ్యాపారవేత్త ఇచ్చిన రూ.5 లక్షల విరాళంతో కొనుగోలు చేసిన వెయ్యి పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లను శుక్రవారం దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావుకు మంత్రి అందజేశారు.  గాంధీ నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, బన్సీలాల్‌పేట్‌ కార్పొరేటర్‌ కె.హేమలత, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, బేగంపేట్‌ సర్కిల్‌ కమిషనర్‌ ముకుందరెడ్డి, వైద్యాధికారి డాక్టర్‌ రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు జి.పవన్‌కుమార్‌గౌడ్‌, కె.లక్ష్మీపతి, ఏసూరి మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo