శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 08, 2020 , 23:36:33

పని ప్రదేశాల్లోనే రిజిస్ట్రేషన్‌

పని ప్రదేశాల్లోనే రిజిస్ట్రేషన్‌

  • వలస కార్మికులకు అండగా ప్రభుత్వం
  • నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు
  • మేయర్‌ బొంతు రామ్మోహన్‌

సిటీబ్యూరో: వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు నిర్మాణ ప్రదేశాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ చెప్పారు. శుక్రవారం మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌తో కలిసి ఆయన రాయదుర్గ్‌లోని మైహోంహబ్‌లో పనిచేస్తున్న వలస కార్మికులతో మాట్లాడారు. నెలాఖరు వరకు అన్ని రాష్ర్టాలకు తెలంగాణ నుంచి వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తాయని భరోసా ఇచ్చారు. వలస కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, కార్మికులను ప్రభుత్వం సొంత బిడ్డల్లా చూసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు, పురపాలక శాఖ మంత్రి కే.టీ. రామారావు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మేయర్‌ వివరించారు. 

కాలినడకన వెళ్లొద్దు: సీపీ

వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని, ఎవరూ కాలినడకన వెళ్లొద్దని  సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. 

పసరిహద్దుల్లో స్క్రీనింగ్‌..

స్వస్థలాలకు చేరుకునే వారికి సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద స్క్రీనింగ్‌ చేస్తామని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడించారు. కొత్తగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం వద్ద స్క్రీనింగ్‌ చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డయల్‌ 100, రాచకొండ కొవిడ్‌ కంట్రోల్‌ నం. 9490617234, ఎల్బీనగర్‌ జోన్‌ కంట్రోల్‌ రూమ్‌  8333993365కు ఫోన్‌ చేయాలని సూచించారు.


logo