శనివారం 30 మే 2020
Hyderabad - May 08, 2020 , 23:36:39

మూసీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

మూసీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

బండ్లగూడ: మూసీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్పష్టం చేశారు.  హైదర్‌గూడలో హెచ్‌ఆర్‌డీసీ ఆధ్వర్యంలో మూ సీ వెంట శ్మశానవాటికను ఆనుకొని రోడ్డు విస్తరణ పనులను ఇటీవల గ్రామస్తులు అడ్డుకు న్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, కార్పొరేటర్‌ రావుల విజయజంగయ్యతో కలిసి రోడ్డు పనులను పరిశీలించారు. శ్మశానవాటికకు ఇబ్బందులు లేకుండా పిల్లర్లు నిర్మించి శ్లాబ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

రోడ్డు విస్తరణ పనుల పరిశీలన

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని రాయదుర్గం మల్కంచెరువు చుట్టూ నూతనంగా ఏర్పా టు చేయనున్న రోడ్డు విస్తరణ పనులను  శుక్రవారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి పరిశీలించారు. మల్కంచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా సంబంధిత అధికారులతో చర్చించారు.కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఎస్‌ఈ రహమాన్‌, ఈఈ సర్ధార్‌సింగ్‌, సిటీప్లానర్‌ ఏకేరెడ్డిలతో పాటు ఇరిగేషన్‌, శేరిలింగంపల్లి సర్కిల్‌కు చెం దిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు తనిఖీ

సిటీబ్యూరో: రూ.23కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పంజాగుట్ట ఫ్లైఓవర్‌ పనులను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు శ్మశానవాటిక వైపు రోడ్డు విస్తరణ పనులను కూడా తనిఖీ చేశారు. అనంతరం లెదర్‌ పార్కు నుంచి రోడ్డు నంబర్‌-45వరకు, ప్రశాసన్‌నగర్‌లో నిర్మిస్తున్న స్లిప్‌ రోడ్లు, మిస్సింగ్‌ రోడ్డు పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు.


logo