శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 08, 2020 , 23:36:41

సిటీ రోడ్లపైకి.. 40 శాతం వాహనాలు

సిటీ రోడ్లపైకి.. 40 శాతం వాహనాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నిబంధనలలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో శుక్రవారం హైదరాబాద్‌ రోడ్లపైకి భారీ సంఖ్యలో వాహనాలు వచ్చాయి. సడలింపులను ఆసరాగా చేసుకొని పనిలేని వాళ్లు సైతం రోడ్లపైకి వచ్చారు. మరో పక్క పాసులు కావాలంటూ డీసీపీల కార్యాలయాల వద్దకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. నిర్మాణ రంగం, దాని అనుబంధ దుకాణాలు, రవాణా, రిజిస్ట్రేషన్లతో పాటు ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు కూడా పలువురు కార్యాలయాలకు వెళ్తున్నారు. వీటికి తోడు మద్యం దుకాణాలు కూడా తెరిచి ఉండడంతో అక్కడకు వెళ్లే వారు ఉన్నారు. దీంతో సాధారణ సమయాల్లో ఉండే ట్రాఫిక్‌లో 35 నుంచి 40 శాతం వాహనాలు రోడ్లపైకి వచ్చాయని పోలీసులు పేర్కొంటున్నారు.  

Next Article A Good Boy

logo