శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 08, 2020 , 00:36:26

అత్తింటి వేధింపులతోనే ఆత్మహత్య

అత్తింటి వేధింపులతోనే ఆత్మహత్య

  • మృతురాలి తండ్రి ఆరోపణ

శేరిలింగంపల్లి : భర్త, అత్త, మామల వేధింపుల కారణంగానే తన కూతురు శేష సంతోషకుమారీ ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తండ్రి ఆరోపించారు. కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలోని అపార్టుమెంట్‌పై నుంచి దూకి బుధవారం నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. గురువారం మృతురాలి తండ్రి వెంకటరమణారావు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా, రోటరీనగర్‌కు చెందిన తన పెద్ద కూతురు శేష సంతోషకుమారిని కొండాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పాండురంగారావుకు ఇచ్చి గత ఫిబ్రవరి 15న వివాహం చేశామన్నారు. పెండ్లి అయి మూడు నెలలు గడవకముందే..  భర్త పాండురంగారావు, అత్త భారతి, మామ యాదగిరి రావులు తమ కూతురిని తీవ్ర వేధింపులకు గురిచేశారని, అందుకే  తీవ్ర మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు.  కాగా... భర్త తనను అర్థం చేసుకోవడం లేదని, తను ఏం చేసినా తప్పు పడుతున్నాడని, తమది పేద కుటుంబమని చిన్నచూపు చూస్తున్నారని మృతురాలు శేష సంతోషకుమారి రాసిన సూసైడ్‌నోటును గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


logo