శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 07, 2020 , 00:27:45

శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి జయంతి

 శ్రీ  లక్ష్మీ నర్సింహస్వామి జయంతి

బంజారాహిల్స్‌ రోడ్‌ నం 12లోని హరేకృష్ణ మూవ్‌మెంట్‌ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జయంతి బుధవారం నిర్వహించారు. భక్తులు లేకుండా కేవలం అర్చకులు మాత్రమే పాల్గొన్న ఈ వేడుకల్లో అభిషేకం, సుదర్శన హోమం, పల్లకి ఊరేగింపు, స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రాంతీయ అధ్యక్షుడు సత్యచంద్ర గౌరదాస తదితరులు పాల్గొన్నారు.

-బంజారాహిల్స్‌,నమస్తే తెలంగాణ


logo