సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 07, 2020 , 00:15:47

తమ్మారెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

తమ్మారెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

బంజారాహిల్స్‌ : లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సినీ కార్మికులను ప్రాంతాలవారీగా విభజిస్తూ మాట్లాడడమే కాకుండా తెలంగాణ యూనియన్లను అవమానించిన సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇందిరానగర్‌లోని ఫెడరేషన్‌ కార్యాలయంలో ఫేడరేషన్‌ కోశాధికారి వజినేపల్లి ఠాగూర్‌తో కలిసి మాట్లాడారు. తెలంగాణ సినిమా యూనియన్లలో సభ్యులకు సహాయం సరిగా అందడం లేదని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత తమ్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారని, తెలంగాణ యూనియన్లు ఎవరు ఏర్పాటు చేశారంటూ అవమానించేలా మాట్లాడారన్నారు. రాష్ట్రం వచ్చినంత మాత్రాన తెలంగాణ యూనియన్‌ ఏర్పాటు చేసుకుంటారా? అని తెలంగాణ సినీ కార్మికులను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.


logo