శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 07, 2020 , 00:15:47

కరోనా పాజిటివ్‌ కేసులు

కరోనా పాజిటివ్‌ కేసులు

ఎల్బీనగర్‌ : హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని నాగోలు సాయినగర్‌ రోడ్‌ నం.4లో నివాసముండే యువకుడు(27) మలక్‌పేట్‌లోని ఓ దవాఖానలో శనివారం డయాలిసిస్‌ చేయించుకున్నాడు. అనంతరం అనారోగ్యానికి గురికాగా అతడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే గాంధీకి తరలించారు. అదేవిధంగా లింగోజిగూడ డివిజన్‌ విజయపురి కాలనీకి చెందిన డయాలసిస్‌ పేషెంట్‌ (61) ఓ దవాఖానకు వైద్య పరీక్షలకు వెళ్లగా కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే ఉస్మానియాకు వెళ్లగా అక్కడి నుంచి గాంధీ దవాఖానకు పంపించారు. వీరి కుటుంబాలను క్వారంటైన్‌లో ఉంచారు.

అమీర్‌పేట్‌ : ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న గురుమూర్తినగర్‌కు చెందిన వ్యక్తికి(48) కొవిడ్‌ 19 పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. అధికారులు వెంటనే అతడిని గాంధీ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు.


logo