శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 07, 2020 , 00:15:46

టీఎస్‌పీఈఏ హర్షం

టీఎస్‌పీఈఏ హర్షం

సిటీబ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ ముసాయిదా బిల్లు - 2020ని  వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రకటించడంపై తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌(టీఎస్‌పీఈఏ) హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు టీఎస్‌పీఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. రత్నాకర్‌రావు, పి.సదానందం బుధవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ బిల్లుపై నాలుగు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా అన్ని విద్యుత్‌ సంఘాలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు. ఈ బిల్లు వల్ల విద్యుత్‌ సంస్థలు ప్రైవేట్‌పరం అవుతాయని, రాష్ర్టా హక్కులు హరించబడతాయని, బడా కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి వెళతాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ బిల్లుపై జాతీయ విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల సమాఖ్య, భారత పవర్‌ ఇంజినీర్ల సమాఖ్య తరపున జాతీయ స్థాయిలో పోరాడుతామని తెలిపారు.


logo