శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 07, 2020 , 00:07:19

ఒక్క రోజే 9 లక్షల ఆదాయం

ఒక్క రోజే 9 లక్షల ఆదాయం

30 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌..

  • ఐదుగురికే అనుమతిపలు కార్యాలయాల్లో సందడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా, లాక్‌డౌన్‌లో డీలా పడ్డ రిజిస్ట్రేషన్లు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. బుధవారం ఒక్కరోజే గ్రేటర్‌ పరిధిలో రూ.9 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు మినహాయింపునివ్వగా ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.కరోనా నేపథ్యంలో కార్యాలయాల్లోకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక అంతా సవ్యంగా ఉంటేనే కార్యాలయాల్లోకి అనుమతిస్తుండటంతో 30 నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియంతా పూర్తవుతున్నది. బుధవారం హైదరాబాద్‌ దక్షిణమండలం పరిధిలో మొత్తం 4 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా రూ. 1.98 లక్షల ఆదాయం సమకూరింది. ఇక హైదరాబాద్‌ నార్త్‌ మండల పరిధిలో మొత్తం 10 డాక్యుమెంట్లు రిజిష్టర్‌ కాగా, రూ. 7.78 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. 


logo