ఆదివారం 31 మే 2020
Hyderabad - May 07, 2020 , 00:07:20

అవి తప్పుడు నివేదికలు

అవి తప్పుడు నివేదికలు

సుల్తాన్‌బజార్‌ : ప్రభుత్వ వైద్యులమంటూ రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌-19 పరీక్షలపై సర్వే చేసి కేంద్రానికి తప్పుడు నివేదికను ఇచ్చిన వైద్యుల బృందంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర స్థాయిలో ఖండించింది. ఈ మేరకు బుధవారం కోఠి డీఎంఈ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ బి.రమేశ్‌, కన్వీనర్‌, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను చేయకుండా, తప్పుడు రిపోర్టింగ్‌ ఇస్తున్నదని, ప్రభుత్వ వైద్యులకు సరైన కిట్లను అందజేయడం లేదని ఓ వైద్య బృందం కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొనడం అవాస్తవమన్నారు. జేఏసీ అడిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గాంధీ, చెస్ట్‌, కింగ్‌కోఠి, ఫీవర్‌ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, సిబ్బందికి పీపీఈ కిట్లను, ఎన్‌-95 మాస్కులను అందజేసిందన్నారు. సంతోష్‌కార్లేటి, విజయానంద్‌ జమాపురి, వేదప్రకాష్‌, శ్రీకాంత్‌, రాజేందర్‌రెడ్డి, కరుణల బృందం ప్రభుత్వ వైద్యులు కాదని వారు స్పష్టం చేశారు. ఐసీఎంఆర్‌ సూచనల మేరకు కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, చీఫ్‌ సలహాదారులు జూపల్లి రాజేందర్‌, కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నరహరి, కో కన్వీనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, కో చైర్మన్‌ డాక్టర్‌ రాఘవేందర్‌రెడ్డి, మహిళా వింగ్‌ సభ్యులు రామలక్ష్మి, ప్రసన్న, సుజాత, వనిత  పాల్గొన్నారు.


logo