శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 07, 2020 , 00:03:04

11న మామిడి వేలం

11న మామిడి  వేలం

చర్లపల్లి : చర్లపల్లి వ్యవసాయక్షేత్రం లో మామిడి కాయల వేలం పాట నిర్వహిస్తున్నామని జైలు సూపరింటెండెంట్‌ దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ ఎంఆర్‌. భాస్కర్‌ ఆధ్వర్యంలో ఈనెల 11న బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేలంలో పాల్గొనేవారు ఆధార్‌కార్డు, రైతు గుర్తింపు పత్రం తీసుకొని హాజరుకావాలని, రూ.5వేల ధరావతు సొమ్మును 11 గంటలలోపు చెల్లించాలన్నారు. వేలం దక్కించుకున్నవారు మామిడి చెట్ల పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌ దశరథరామిరెడ్డి తెలిపారు.


logo