బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 06, 2020 , 23:35:20

మాజీ ఎంపీ కవితతో చొరవతో స్వరాష్ర్టానికి కార్మికులు

మాజీ ఎంపీ కవితతో చొరవతో స్వరాష్ర్టానికి కార్మికులు

కవాడిగూడ : వ్యవసాయ ఉత్పత్తుల తయారీ శిక్షణ కోసం మహారాష్ట్రలోని సోలాపూర్‌ వెళ్లిన తెలంగాణ యువతులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. తమను స్వరాష్ర్టానికి తీసుకెళ్లాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితను వారు ట్విట్టర్‌లో సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించిన కవిత అక్కడి పోలీస్‌ కమిషనర్‌, అధికారులతో మాట్లాడి 72 మంది యువతులను మూడు బస్సుల్లో తెలంగాణకు రప్పించారు. బుధవారం నగరానికి చేరుకున్న వారికి ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్కులో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపించారు.logo