శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 06, 2020 , 23:32:56

తార్నాక కార్పొరేటర్‌ భర్తపై కేసు

తార్నాక కార్పొరేటర్‌ భర్తపై కేసు

 ఉస్మానియా యూనివర్సిటీ:  తార్నాక కార్పొరేటర్‌ ఆలకుంట సరస్వతి భర్తపై కేసు నమోదయింది. నిఖిల్‌, ప్రదీప్‌, గణేశ్‌, విక్కీలు తార్నాక కార్పొరేటర్‌ ఆలకుంట సరస్వతి భర్త హరి, అతని స్నేహితులు శ్రీనివాస్‌, విజయ్‌, శేఖర్‌లతో ఈ నెల 4న పేకాట ఆడారు. ఈ క్రమంలో హరి స్నేహితులు పేకాటలో 80 వేలు పోగొట్టుకున్నారు. తిరిగి 5న సాయంత్రం నిఖిల్‌ స్నేహితులు హరి ఇంట్లో పేకాట ఆడేందుకు వచ్చారు. ఈ క్రమంలో నిఖిల్‌ స్నేహితులు తమను మోసం చేసి.. 80వేలు గెలిచారని.. ఇందుకు రూ.7 లక్షలు ఇవ్వాలని ఆలకుంట హరి, అతని స్నేహితులు  వారిని డబ్బులు డిమాండ్‌ చేశారు. అలాగే నిఖిల్‌,ప్రదీప్‌, గణేశ్‌లను తిడుతూ భయభ్రాంతులకు గురిచేశారు.

ఈ క్రమంలో నిఖిల్‌ పరారయ్యాడు. అక్కడే ఉన్న మరో ఇద్దరిపై కర్రలతో దాడిచేడంతోపాటు కార్పొరేటర్‌ ఆలకుంట సరస్వతి సైతం వారిని బూతులు తిట్టింది. 24 గంటల్లో  డబ్బులు తీసుకురావాలని వారిని హెచ్చరించి పంపించారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు  చేపట్టారు. 


logo