సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 06, 2020 , 00:36:00

జూన్‌ చివరికి..లింక్‌ రోడ్లు పూర్తి!

జూన్‌ చివరికి..లింక్‌ రోడ్లు పూర్తి!

 • 313.65 కోట్లతో44.70 కిలోమీటర్ల రోడ్డు
 • వడివడిగా పనులు
 • మంత్రి ఆదేశాలతో  భూసేకరణ

ప్రధాన రహదారులను కలుపుతూ ప్రతిపాదించిన లింకురోడ్ల పనులు వడివడిగా సాగుతున్నాయి. రద్దీలేని రోడ్లపై పనుల వేగం పెంచాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో త్వరితగతిన భూసేకరణ పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకున్నది. సర్కిళ్ల వారీగా భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతుండగా, రోడ్ల పనులు హెచ్‌ఆర్‌డీసీఎల్‌ చేపడుతున్నది. వచ్చే జూన్‌ చివరికల్లా పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. 


సిటీబ్యూరో/ మాదాపూర్‌:ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను అదుపుచేసే ఉద్దేశంతో కాలనీల మీదుగా ప్రధాన రోడ్లకు మొత్తం 37 లింక్‌ రోడ్ల ఏర్పాటుకు గాను భూసేకరణ జీహెచ్‌ఎంసీ చేపడుతుండగా, రోడ్ల నిర్మాణాన్ని హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు అప్పగించారు.  మొత్తం  44.70 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 313.65 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. వీటి ఏర్పాటుకు 50 శాతం నిధులు జీహెచ్‌ఎంసీ, మిగిలిన 50 శాతం హెచ్‌ఆర్‌డీసీఎల్‌ భరిస్తాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భూసేకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందుకు అవసరమైన భూసేకరణ 29 చోట్ల పూర్తై పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.  త్వరలో మిగిలిన 8 ప్రాంతాల్లోనూ భూ సేకరణ పూర్తవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న స్ట్రెచ్‌లలో భూసేకరణ పూర్తికావడంతో వాటిని హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు అప్పగించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మాదాపూర్‌లోని 100 ఫీట్‌ రోడ్డులోని హైటెన్షన్‌ రోడ్డు మొదలుకొని సున్నం చెరువు మీదుగా ఎస్‌ఆర్‌నగర్‌ ఉమేశ్‌చంద్ర విగ్రహం వరకు సుమారు రూ.5 కోట్ల వ్యయంతో 5 కిలో మీటర్ల మేర రోడ్డు పనులను చేపట్టింది. కాగా లింక్‌ రోడ్డు  పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.

ప్యాకేజ్‌-ఏ 1లో (రూ. 79.87కోట్లతో)..

 • నిజాంపేట్‌ క్రాస్‌రోడ్స్‌- హైటెక్స్‌ జంక్షన్‌ వయా వసంత్‌నగర్‌, ఎన్‌ఏసీ 
 • హెచ్‌టీ లైన్‌-మియాపూర్‌ రోడ్‌ 
 • భరత్‌నగర్‌ ఆర్‌వోబీ-హైటెక్స్‌ రోడ్‌ వయా మోతీనగర్‌, బోరబండ అరబిందో లులూ మాల్‌, గౌసియా మసీద్‌
 • మాధవి హిల్స్‌-నార్నే రోడ్‌ వయా కేమ్‌- లాట్‌
 • శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ జోనల్‌ ఆఫీసు-ఎన్‌హెచ్‌ 65, జీఎస్‌ఎం మాల్‌, వయా మంజీరా పైప్‌లైన్‌ రోడ్‌
 • బొటానికల్‌ గార్డెన్‌ రోడ్‌ (కొండాపూర్‌)- హఫీజ్‌పేట్‌ రైల్వే ట్రాక్‌ వయా జేవీ హిల్స్‌
 • బయోడైవర్సిటీ లింకురోడ్‌
 • ఓల్డ్‌ బాంబే హైవే- ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వయా ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌
 • ఓల్డ్‌ బాంబే హైవే- ఖాజాగూడ రోడ్‌ వయా మల్కం చెరువు, చిత్రపురి కాలనీ
 • ఎన్‌ఏసీ-కేపీహెచ్‌ రోడ్‌
 •  ప్యాకేజ్‌ బీ1లో (రూ. 91.02కోట్లతో)..
 • మియాపూర్‌ మెట్రో డిపో-కొండాపూర్‌ మసీద్‌ జంక్షన్‌ వయా ఐడీపీఎల్‌ ఎంప్లాయీస్‌ కాలనీ, శిల్పా పార్క్‌ ప్రైడ్‌ రోడ్‌
 • షేక్‌పేట్‌ దర్గా జంక్షన్‌ (ఓల్డ్‌ ముంబై రోడ్‌)- ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ మైహోమ్‌ అవతార్‌ వయా షేక్‌పేట్‌, మణికొండ రోడ్‌, ల్యాంకో హిల్స్‌ రోడ్‌, -నార్సింగి-పుప్పాలగూడ రోడ్‌
 • వెస్టిన్‌ హోటల్‌ - మాదాపూర్‌ మెయిన్‌రోడ్‌
 • ఓల్డ్‌ ముంబై  హైవే (లెదర్‌ పార్క్‌)- రోడ్‌ నం-45 హెచ్‌టీ లైన్‌ 
 • ఖాజాగూడ లేక్‌-ఓఆర్‌ఆర్‌ ప్యారలల్‌-ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్‌ వాల్‌
 • చిత్రపురి కాలనీ-మణికొండ వయా నాలా
 • నోవాటెల్‌-ఆర్‌టీఏ ఆఫీస్‌
 • కూకట్‌పల్లి ఫేస్‌-4- ప్రపోజ్ట్‌ స్లిప్‌ రోడ్‌
 • ప్యాకేజ్‌-ఏ2లో (రూ. 76.30కోట్లతో).. 
 • హైటెక్‌సిటీ ఫేస్‌-2 - గచ్చిబౌలి ఇనార్బిట్‌ రోడ్‌ 
 • న్యూ అల్లాపూర్‌-100 ఫీట్‌ రోడ్‌, సున్నంచెరువు  
 • సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌- పీర్జాదిగూడ రోడ్‌ 
 • గోపన్‌పల్లి-విప్రో సర్కిల్‌ క్యూ సిటీ - ఎన్‌ఐఏబీ వయా మై హోమ్‌ విహంగ జేవీ హిల్స్‌ పార్క్‌- మసీద్‌బండ రోడ్‌ వయా ప్రభుపాద లేఔట్‌ హెచ్‌టీ లేన్‌ 
 • అల్కాపురి బస్‌స్టాప్‌-బండ్లగూడ రోడ్‌ వయా సాయినగర్‌ చెరువు నెక్నంపూర్‌ రోడ్‌- ఉస్మాన్‌ సాగర్‌ రోడ్‌ వయా అల్కాపూర్‌ టౌన్‌షిప్‌)
 • ప్యాకేజ్‌ బీ2లో(రూ. 66.46కోట్లతో)..
 • ఐఎస్‌బీ రోడ్‌- ల్యాంకో హిల్స్‌ జంక్షన్‌ బాపూఘాట్‌ బ్రిడ్జి-అత్తాపూర్‌ బ్రిడ్జి గన్‌రాక్‌-ఎస్‌హెచ్‌-1 అంబేద్కర్‌ విగ్రహం- గోల్నాక వయా కమేలా నాచారం, మల్లాపూర్‌ రోడ్‌- మౌలాలి ఫ్లైఓవర్‌ రాధికా క్రాస్‌రోడ్స్‌- బాలాజీనగర్‌ డంపింగ్‌యార్డ్‌ బోడుప్పల్‌ కాలనీ రోడ్‌-మల్లాపూర్‌ రోడ్‌ (పద్మావతి కాలనీ బస్‌స్టాప్‌) వయా రామా చెరువు బతుకమ్మ ఘాట్‌ ఉప్పల్‌ (ఘట్‌కేసర్‌ రోడ్‌)-బోడుప్పల్‌ కాలనీ రోడ్‌ అక్షయ ఫుడ్‌ కోర్ట్‌, గోకుల్‌నగర్‌-హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ ఎన్‌హెచ్‌-9 వయా ఐడీపీఎల్‌ కాలనీ సరూర్‌నగర్‌-హయాత్‌నగర్‌ రోడ్‌ వయా ఇండోర్‌ స్టేడియం) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-70 (ప్రశాసన్‌నగర్‌)- జూబ్లీహిల్స్‌ నార్నే రోడ్‌ నం-78
 • వేగంగా పనులు జరుగుతున్న ప్రాంతాలు..
 • ఓల్డ్‌ ముంబై రోడ్డు- రోడ్‌ నం-45 వయా నంది హిల్స్‌ జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి కార్యాలయం-ఎన్‌హెచ్‌-65  ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌- ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ - పీర్జాదిగూడ 
 • నెక్నాంపూర్‌ రోడ్‌- ఉస్మాన్‌సాగర్‌ వయా అల్కాపురి హుడా వెస్టిన్‌ హోటల్‌-మాదాపూర్‌ మెయిన్‌ రోడ్‌ 
 • నోవాటెల్‌-ఆర్టీఏ ఆఫీసు ప్రశాసన్‌నగర్‌ రోడ్‌ నం-70- జూబ్లీహిల్స్‌ బాపూఘాట్‌ బ్రిడ్జి- అత్తాపూర్‌ బ్రిడ్జి రాధికా థియేటర్‌-డంపింగ్‌యార్డ్‌

పనులు పరిశీలించిన మేయర్‌


కేపీహెచ్‌బీ కాలనీ : కేపీహెచ్‌బీకాలనీ 7వ ఫేజ్‌ నుంచి గోపాల్‌నగర్‌ మీదుగా మియాపూర్‌ వెళ్లే రోడ్డు విస్తరణ పనులు, సర్దార్‌పటేల్‌నగర్‌లో పార్కు స్థలాన్ని  మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్మే మాధవరం కృష్ణారావు, జోనల్‌ కమిషనర్‌ వి.మమత, కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్‌రావు, పండాల సతీశ్‌గౌడ్‌, తూము శ్రావణ్‌కుమార్‌ పరిశీలించారు.

మాదాపూర్‌:  కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, రాజ రాజేశ్వరీ కాలనీలోని హెచ్‌టీ లైన్‌ రోడ్డు, జేవీజీ ప్రభుపాద నుంచి వయా ఎస్‌ఎమ్‌ఆర్‌ మీదుగా మసీద్‌బండ ప్రధాన రహదారి వరకు 100 ఫీట్‌ రోడ్డు, మసీద్‌బండ హెరిటేజ్‌ నుంచి  రైల్వే బ్రిడ్జి న్యూ బాంబే హైవే వరకు 100 ఫీట్‌ రోడ్డును ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు అధికారులతో కలిసి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు.


logo