ఆదివారం 31 మే 2020
Hyderabad - May 06, 2020 , 00:13:23

ఘట్‌కేసర్‌ నుంచి బీహార్‌కు ప్రత్యేక రైలు

ఘట్‌కేసర్‌ నుంచి బీహార్‌కు ప్రత్యేక రైలు

 సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :తెలంగాణ ప్రభుత్వం వలస కూలీల కోసం మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.  బీహార్‌ కూలీలు  స్వగ్రామాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రయాణ ఏర్పాట్లు చేసింది.  దేశంలోనే మొట్టమొదటిసారిగా మే డే రోజు ఉదయం ప్రత్యేక ప్యాసింజర్‌ రైలును లింగంపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియాకు 1,225 మంది కూలీలతో పంపించగా..  రెండో రైలును ఘట్‌కేసర్‌ నుంచి బీహార్‌లోని ఖగారియా ప్రాంతానికి  1250 మంది వలస కూలీలతో మంగళవారం ఉదయం పంపించింది. ఈ రైలులో కూలీలకు ఆహార పదార్థాలు, మాస్క్‌లు, శానిటైజర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వలస కూలీల ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించింది.  50 ఆర్టీసీ బస్సుల ద్వారా కూలీలను రైల్వే స్టేషన్‌కు తరలించారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, ఐఏఎస్‌ అధికారులు రోనాల్డ్‌రోజ్‌, రజత్‌షైన్‌. మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


logo