సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 06, 2020 , 00:08:14

మంత్రి సబితారెడ్డి జన్మదినం సందర్భంగా..

మంత్రి సబితారెడ్డి జన్మదినం సందర్భంగా..

కందుకూరు : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాళ్ల కార్తీక్‌, మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ బొక్క దీక్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురుసాని వరలక్ష్మి సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్‌, ఉపాధ్యక్షుడు సామ మహేందర్‌రెడ్డి, డైరెక్టర్లు పొట్టి ఆనంద్‌, సామ ప్రకాశ్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, సర్పంచ్‌ సురుసాని శమంతకమణి, ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి, మూల హన్మంత్‌రెడ్డి, బర్కం వెంకటేశ్‌, విష్ణు, ప్రశాంత్‌చారి, నరేందర్‌ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. మీర్‌పేటలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి,  కార్పొరేటర్‌ సిద్దాల లావణ్య బీరప్ప, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


logo