ఆదివారం 31 మే 2020
Hyderabad - May 06, 2020 , 00:03:22

గాంధీ డాక్టరమ్మకు ఘనస్వాగతం

 గాంధీ డాక్టరమ్మకు ఘనస్వాగతం

చందానగర్‌ : మియాపూర్‌ న్యూ కాలనీకి చెందిన  రజిని గాంధీ దవాఖానలో జూనియర్‌ డాక్టర్‌గా కొవిడ్‌ పేషెంట్లకు సేవలందించి నెల రోజుల తర్వాత మంగళవారం ఇంటికి చేరుకున్నది. విషయం తెలుసుకున్న బస్తీ పెద్దలు, స్థానిక విజయ వినాయక యూత్‌ సభ్యులు డాక్టర్‌ రజినితో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించారు. స్థానికులు చూపించిన గౌరవం, ప్రేమాభిమానానికి వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు, యూత్‌ సభ్యులు బాలరాజు, లక్ష్మయ్యగౌడ్‌, శంకర్‌, కిరణ్‌, రవిరాజా, కనకరాజు, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo