బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 05, 2020 , 23:57:58

సాయం.. మారువలేం..

సాయం.. మారువలేం..

 • మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాలను అందజేశారు. నాదర్‌గుల్‌ మాతృదేవోభవ అనాథాశ్రమంలో మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, 5వ వార్డులో కార్పొరేటర్‌ బోయపల్లి దీపిక శేఖర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వరలక్ష్మీసురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ  చేశారు.
 • రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే  టి.ప్రకాశ్‌గౌడ్‌   పుట్టినరోజు  సందర్భంగా వట్టినాగులపల్లిలోని ఎస్‌ఓఎస్‌ అనాథాశ్రమంలో పిల్లలకు నిత్యావసర వస్తువులు, హ్యాండ్‌వాష్‌ ప్యాకెట్లు, సబ్బులు అందజేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి,వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌యాదవ్‌, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 • సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • చెంగిచర్లలో రాజ్‌మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సత్యనారాయణ, వాసు, రాజు తదితరులు 250 మంది నిరుపేద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • కీసరలోని నాయీబ్రాహ్మణులకు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ రామిడి ప్రభాకర్‌రెడ్డి, సీఐ జె.నరేందర్‌గౌడ్‌, సర్పంచ్‌ నాయకపు మాధురి వెంకటేశ్‌ సరుకులను పంపిణీ చేశారు. 
 • జవహర్‌నగర్‌ 2వ డివిజన్‌ పరిధిలోని కార్మికనగర్‌లో లీడ్‌ బ్యాంక్స్‌ ఆధ్వర్యంలో 500 మందికి భోజనం, బీటూసీ సంస్థ సహకారంతో 100 మందికి నిత్యావసర సరుకులను మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ శివాజీ అందజేశారు.
 • మేడ్చల్‌ జిల్లా టీఎన్జీవోస్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌ మెంట్‌ఫోరం అధ్యక్షుడు రవి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌లోని గబ్బిలాపేటలో 200 మందికి ఆహార ప్యాకెట్లు అందజేశారు. 
 • బోడుప్పల్‌ 24వ డివిజన్‌లో కార్పొరేటర్‌ గుర్రాల రమావెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు చామకూర భద్రారెడ్డి ఆధ్వర్యంలో మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు మహేందర్‌, వెంకటేశ్వర్లు సరుకులు అందజేశారు. 
 • ఎంపీ రంజిత్‌రెడ్డి సహకారంతో కుర్మల్‌గూడలో మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, జనప్రియ మహానగర్‌లో కార్పొరేటర్‌ ప్రమీల యాదగిరి ముదిరాజ్‌  నాయీ బ్రహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • మెహిదీపట్నం డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం సిబ్బందికి నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌హుస్సేన్‌ ఆధ్వర్యంలో సరుకులు ఇచ్చారు. 
 • నాగోలులో అంతర్జాతీయ వైశ్యఫెడరేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు, ఉప్పల ఫౌండేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త పేద బ్రాహ్మణులకు సరుకులను ఇచ్చారు. 
 • నాంపల్లిలో ఆయిస్టర్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ సీఈవో వేముల శరత్‌బాబు, టీఆర్‌ఎస్‌ నేత నందకిశోర్‌వ్యాస్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • చిక్కడపల్లి పద్మశాలి సంఘం నాయకులు గంట్యాల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, స్థానిక కార్పొరేటర్‌ పద్మానరేశ్‌ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం అందించారు. రాంనగర్‌ పాలమూరు బస్తీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.  
 • చందానగర్‌ రాజీవ్‌నగర్‌ బస్తీలో వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ మిర్యాల రాఘవరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ 600 మంది నిరుపేదలకు సరుకులను పంపిణీ చేశారు. 
 • సంఘసేవకుడు మీర్జా నాజిబ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో అడ్డీ కార్ఖానాలో 700 మంది పేద ముస్లింలకు రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • బర్కత్‌పుర రాఘవేంద్రస్వామి మఠంలో మేనేజర్‌ పురణిక్‌ ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్లోర్‌లీడర్‌ దిడ్డి రాంబాబు సరుకులు పంపిణీ చేశారు.
 • బోరబండ డివిజన్‌ సైట్‌-3లోని కంటైన్మెంట్‌ క్లస్టర్‌లో సేవలందించిన పోలీసులు, శాఖల సిబ్బంది, సేవకులను డిప్యూటీమేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌ సత్కరించారు  బాబా సైలానీనగర్‌ బస్తీలో డిప్యూటీ మేయర్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • హిమాయత్‌నగర్‌, హైదర్‌గూడ, నారాయణగూడలో 400మంది పేదలకు  నిత్యావసర సరుకులను చేతనా ఫౌండేషన్‌ అధ్యక్షుడు కేశబోయిన శ్రీధర్‌, ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌ అందజేశారు.
 • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి, 33వ వార్డు ఇంద్రన్న కాలనీలో కేఎస్‌ఆర్‌ యువసేన ఆధ్వర్యంలో 500 మంది నిరుపేదలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కొలన్‌ శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌యాదవ్‌ సరుకులు ఇచ్చారు.
 • విప్రో సంస్థ అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ సహకారం అందించగా మల్లికార్జునకాలనీలోని సదాశివస్కూల్‌ ఆవరణలో స్వర్డ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఓల్డ్‌ బోయిన్‌పల్లి కార్పొరేటర్‌ ముద్దం నర్సింహయాదవ్‌ 200 మంది వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని నిరుపేద బ్రాహ్మణులు, పురోహితులైన 80 కుటుంబాలకు కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వినాయక్‌నగర్‌, దత్తాత్రేయనగర్‌, సుభాష్‌చంద్రబోస్‌నగర్‌, పీజేఆర్‌నగర్‌లో 600మంది నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్‌ సరుకులు ఇచ్చారు.
 • కేపీహెచ్‌బీకాలనీలోని సేవ్‌ ఏ లైఫ్‌.. సేఫ్టీ ఫర్‌ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సురగణ రాణాప్రతాప్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌రావు, నేతలు వెంకటేశ్వర్‌రావు, సాయిబాబా చౌదరి సరుకులు పంపిణీ చేశారు. ఆదరణ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల రఘునాథ్‌బాబు ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీ 5, 6వ ఫేజ్‌లలో 300 మంది వలస కూలీలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. 
 • చిలుకానగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌, కౌకొండ జగన్‌ ఆధ్వర్యంలో బీరప్పగడ్డ మసీదు ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్లకు మంగళవారం ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, జగన్నాథ్‌గౌడ్‌ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.  
 • రామంతాపూర్‌ రోడ్డులోని పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రేటర్‌ నాయకుడు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నం ప్యాకెట్లు, నాచారం కార్పొరేటర్‌ శాంతిసాయిజెన్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో నాచారంలో 4వేల మందికి, శ్రీసోమవంశ సహస్రారజన క్షత్రియ సమాజ్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు రతన్‌ సూర్యప్రకాశ్‌ ఆధ్వర్యంలో హెచ్‌బీకాలనీ తిరుమలనగర్‌లో 200 కుటుంబాలకు 15 రోజులకు సరుకులు ఇచ్చారు. 
 • సలీంనగర్‌లోని గణపతి దేవాలయం వద్ద పేదలకు ఆహారపు ప్యాకెట్లను స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ తెలంగాణ రాష్ట్రశాఖ కన్వీనర్‌ శ్రీనాథ్‌, తుమ్మలపల్లి రమేశ్‌రెడ్డి, సందడి సురేందర్‌రెడ్డి, శ్యాంసుందర్‌, బండి సురేశ్‌ అందజేశారు.
 • మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో దివ్యాంగులకు ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సరుకులు అందజేశారు.
 • పెద్దతూప్ర తండాలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అస్లి రాములు          ఆధ్వర్యంలో మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి సరుకులు ఇచ్చారు.
 • శ్రీ లక్ష్మీ నారాయణ సేవా సమితి, దివ్య చక్ర చారిటబుల్‌ట్రస్టు ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ విఠల్‌రెడ్డి, దివ్య రమణ చక్రవర్తి బ్రాహ్మణులకు సరుకులు ఇచ్చారు.


logo