బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 05, 2020 , 23:38:51

మహిళ అదృశ్యం

మహిళ అదృశ్యం

ఎల్బీనగర్‌: సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామానికి చెందిన బొడ్డు సోమయ్య, చంద్రకళ దంపతులు  కొడుకుతో కలిసి కొత్తపేట మారుతీనగర్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 1న ఉదయం చంద్రకళ కూరగాయల కోసం బయటకు వెళ్లి.. తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 9010507643, 7997570727 నంబర్లలో తెలియజేయాలని కోరారు.

  • మేడిపల్లి: మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి.. బుద్ధానగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
  • సుల్తాన్‌బజార్‌ : కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లోని మిథిలా కాంప్లెక్స్‌ శ్రీపాటిదార్‌ సమాజ్‌ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది.  సుల్తాన్‌బజార్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
  • మేడ్చల్‌: మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని పవన్‌ ఎలక్ట్రికల్స్‌ అండ్‌ కెమికల్‌ గోదాంలో మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది  3 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండవచ్చునని, సుమారుగా రూ 20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు 
  • సైదాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 450 మంది వ్యాపారులపై సైదాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.  
  • మేడ్చల్‌ కలెక్టరేట్‌: మంగళవారం వీచిన ఈదురు గాలులకు నాగారం మున్సిపల్‌ పరిధిలో రాంపల్లిలో రేకుల షెడ్డు నేలమట్టం కాగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.  కీసర కానిస్టేబుళ్లు కృష్ణంరాజు, కృష్ణలు గమనించి వారిని 108లో దవాఖానకు తరలించారు.


logo