బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 05, 2020 , 23:34:30

7,568 వాహనాలు సీజ్‌..

7,568 వాహనాలు సీజ్‌..

  • సిటీబ్యూరో: మీ స్థానికం నుంచి 3 కి.మీ దూరం దాటితే కేసు బుక్‌ కావడంతోపాటు వాహనం సీజ్‌ అవుతుంది.  రాచకొండ పోలీసులు మార్చి 23 నుంచి మే 5వ తేదీ వరకు   1,57,065 లక్షల కేసులను నమోదు చేశారు. దాదాపు 7,568 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని కోర్టులో జమ చేయనున్నారు.
  • దాదూస్‌, బికనీర్‌లో స్వీట్లు కొన్నారా? ఇటీవల అందులో పనిచేసే ఐదు మందికి కరోనా వచ్చిందంటూ తప్పుడు వార్తలను సోషల్‌మీడియాలో సర్క్యూలేట్‌ చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ సంస్థలపై సోషల్‌ మీడియా కేంద్రంగా దుష్ఫ్రచారం చేస్తున్నారని దాదూస్‌ సంస్థ నిర్వాహకులు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
  • బంజారాహిల్స్‌: బ్రాహ్మణులను కించపర్చే విధంగా ‘జూలకటక’ కామెడీ షోను ప్రసారం చేసిన జెమినీ టీవీ మేనేజ్‌మెంట్‌తో పాటు యాంకర్‌ శ్రీముఖిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  


logo